ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు సభలో అడుగు పెట్టబోనని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓ వైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపై స్పీకర్ తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన వివాదస్పద మణిపూర్ అంశం కారణంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఇవాళ(బుధవారం) కూడా సభలో ఆందోళనలు జరిగాయి. దీంతో సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.