రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరావు జోస్యం చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారని చెప్పారు. రాయలసీమ ద్రోహి అంటూ చంద్రబాబుపై ద్వజమెత్తారు.