కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. విద్యారణ్యపురకు చెందిన ఆండీ జార్జ్(28) అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలతో ఆమెను బెదిరించి.. తన స్నేహితుల వద్దకు పంపాడు. ఇందుకోసం స్నేహితుల వద్ద డబ్బు కూడా తీసుకున్నాడు. వారి వద్దకు వెళ్లకపోతే తన దగ్గర ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించి, ఆమెను బలవంతగా ఒప్పించాడు. ఈ విషయంలో ఆండీ జార్జ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.