యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) బుధవారం నాడు దేశంలోని 20 యూనివర్సిటీలను ‘నకిలీ’గా ప్రకటించింది. ఢిల్లీలో ఇలాంటివి అత్యధికంగా ఎనిమిది ఉన్నట్లు వెల్లడించింది. ఈ విద్యాసంస్థలకు పట్టాలు ఇచ్చే అధికారం లేదని పేర్కొంది. "అటువంటి విశ్వవిద్యాలయాలు/సంస్థలు అందించే డిగ్రీలు ఉన్నత విద్య, ఉద్యోగాల కోర్సులో గుర్తించబడవు లేదా చెల్లుబాటు కావు" అని యూజీసీ తెలిపింది.