హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది నిత్యం ఈ దారిలో ప్రయాణిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు అక్టోబర్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల ఆ మార్గంలో స్తంభాల ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు మంగళవారం విద్యుత్ సరఫరాను అందించి బుధవారం దీపాలు వెలిగించారు. దీంతో సీడ్ యాక్సిస్ రహదారి విద్యుత్ కాంతులతో ప్రకాశవంతంగా మారింది.