కావలసిన పదార్థాలు
మరమరాలు: రెండు కప్పులు, గుడ్లు: రెండు, టమాట: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, పల్లీలు, శెనగపప్పు, మినుప పప్పు: ఒక టేబుల్ స్పూన్ చొప్పున, జీలకర్ర, ఆవాలు, పసుపు, చాట్ మసాల, ధనియాలపొడి: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా.
తయారీ విధానం
ముందుగా మరమరాలలో నీళ్లుపోసి ఒకసారి బాగా కలిపి, నీళ్లు లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినుప పప్పు, శెనగపప్పు, పల్లీలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక టమాట ముక్కలు జోడించి, మూతపెట్టి రెండు నిమిషాలపాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, చాట్‌మసాల, ధనియాలపొడి కలిపి గుడ్లను వేసి ఫ్రై చేయాలి. అంతా వేగిన తర్వాత తగినంత ఉప్పు, మరమరాలు వేసి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఉప్మా సిద్ధం.