ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం అంశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టింది. హైకోర్టు తీర్పు కాపీని ప్రభుత్వ న్యాయవాదులు అధ్యయనం చేసే పనిలో పడ్డారు. తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించడంతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మంతనాలు చేపట్టారు. ప్రభుత్వ ప్రయత్నాలపై రైతుల తరపు న్యాయవాదులు కూడా అప్రమత్తమయ్యారు. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేయాలని రైతుల తరపు న్యాయవాదులు నిర్ణయించారు. ఇప్పటికే కేవియట్ పిటీషన్ దాఖలు చేశామని రైతుల తరపు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు చెప్పారు.