తాడేపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తివారి శారదావతి (60) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. అయితే వెంటనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. భీమవరం జిల్లా మొగల్తూరుకు చెందిన బాధితురాలు తివారి శారదావతి.. మొగల్తూరులోని తమ భూములను అధికారులు అక్రమంగా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారని వాపోయింది. కోట్లరూపాయల విలువైన 2.60 ఎకరాల భూమిని అధికారులు అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారని తెలిపింది. తమ ప్రమేయం లేకుండానే మొగల్తూరు ఎమ్మార్వో, వీఆర్వోలు ఆన్లైన్లో తమ పేర్లు మార్చారని మహిళ తెలిపింది. రిజిస్ట్రేషన్, రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ఆస్తులను బదలాయించారని బాధితురాలు ఆరోపించారు.