అనంతపురం జిల్లా, జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పనులను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబును చూసేందుకు ప్రాజెక్టు దగ్గరకు రైతులు తరలివచ్చారు. సీఎం జగన్ చర్యల వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని చంద్రబాబు వారికీ తెలియజేసారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గం నుంచి కియా పరిశ్రమ దగ్గర చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు హయాంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి కియా పరిశ్రమ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.