మహిళా సాధికారత, సంక్షేమం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అవుతుందని తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు సరోజమ్మ, కార్యదర్శి బండి లక్ష్మీదేవి అన్నారు. గురువారం గుంతకల్లు మండలంలోని జి. కొట్టాల గ్రామంలో టిడిపి మహిళా మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మహిళా నాయకురాళ్లు ఇంటింటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు చేపట్టే మహిళా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.