అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెబుతూ వైకాపా ప్రభుత్వం దగాచేస్తోందని సీపీఐ పట్టణ కార్యదర్శి గోపినాథ్, సహాయ కార్యదర్శి గౌస్ విమర్శించారు. గుంతకల్లు పట్టణంలోని బిటి. పక్కీరప్ప భవనంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు, సీపీఐ నాయకులు డిపాజిటర్లకు న్యాయం చేయాలని ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.