ఆగస్టు 10వ తేదీన నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా అందుకు సంబంధించి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు చంద్ర శేఖర్, కోట నాయక్ అన్నారు. గురువారం ఎర్రగొండపాలెంలోని ఎంపిడిఓ కార్యాలయ సమావేశ భవనంలో వైద్య, విద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలలో నివారణకు అవసరమైన చర్యలు చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.