పాఠశాలలో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేయటానికి, వారిలో నాయకత్వ లక్షణాలను పెంచటానికి పాఠశాల హెడ్ మాస్టర్, ఇతర సిబ్బంది సహకారం ఎంతైన అవసరం అని పార స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ నిమ్మ రాజు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గురువారం ఒంగోలు మండలం ముక్తి నూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రధాన అధ్యాపకులుగా పదవీ స్వీకారం చేసిన దేవసేనతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.