గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం హేయమైన ఆలోచనని పురపాలక శాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఎర్రగొండపాలెంలోని మంత్రి గెస్టుహౌస్ లో మంత్రి మాట్లాడుతూ సంతనూతలపాడులో ఎమ్మెల్యే సుధీర్ బాబును గ్రామ ప్రజలు అడ్డుకోవాడాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. టిడిపి ఇలాంటి ఆలోచన మానుకోవాలన్నారు.