ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి 50 పడకల నూతన భవనాన్ని గురువారం నాడు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శిలో నూతనంగా ఏర్పాటుచేసిన 50 పడకల ఆసుపత్రి ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.