భట్టిప్రోలు మండల పరిధిలోని పల్లెకోన గ్రామంలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివరాలతో కూడిన కరపత్రాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి అందజేశారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, పాల్గొన్నారు.