కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవచ్చు. ఎప్పటినుండో చెన్నై లో ఉంటున్న ఓఎన్‌జీసీ కృష్ణా-గోదావరి బేసిన్ కార్యాలయాన్ని రాష్ట్ర పరిధిలోని రాజమహేంద్రవరానికి మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్నీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ యంత్రి రామేశ్వర్ థేలి వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభలో సీపీఐ ఎంపీ ఎస్.వెంకటేశన్ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన గురువారం లిఖితపూర్వ సమాధానం ఇచ్చారు.