చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈరోజు జరిగిన ఘర్షణలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ హింసాత్మక వైఖరికి నిరసనగా రేపు చిత్తూరు జిల్లా బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. నేటి అల్లర్లకు పూర్తిగా టీడీపీ కారణమని అధికారపక్ష నేతలు ఆరోపిస్తుండగా.. వైసీపీ అధికార మదంతో రెచ్చిపోతోందని టీడీపీ నేతలు అశోక గజపతి రాజు, పల్లె రఘునాథ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని వారు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa