ఐఓసీఎల్ పైప్ లైన్కు భూములిచ్చిన రైతుల పిల్లల భవితను తీర్చిదిద్దడం తమ బాధ్యతని ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ వాసుదేవన్ అన్నారు. శుక్రవారం ఆయన బొల్లినేని మెడ్స్కిల్స్ లో విద్యార్థులకు ఉచితం గా అందిస్తున్న ఫార్మసీ అసిస్టెంట్ శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన తొలుత జ్యోతిప్రజ్వలన గావించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి పిల్లలకు మంచిభవిష్యత్ కల్పించేందుకు కృషిచేస్తున్నామన్నారు. హెచార్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్పట్నాయక్ మాట్లాడుతూ ఈ శిక్షణ ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆపరేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ డీఎస్ రావు మాట్లాడుతూ వైద్య రంగం దేశంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని, అధిక స్థాయిలో ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ఇదొకటన్నారు. ఈ శిక్షణతో విద్యార్థులు ఈ రంగంలో స్థిరపడి, ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ సీజీఎం అలోక్సాహూ, టాస్క్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్, బొల్లినేని మెడ్స్కల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, ఐఓసీఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.