విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర పాలనను నడపడానికి సర్వం సిద్ధమవుతోంది. రుషికొండపై ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అక్టోబరు 24 నుంచి సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ శనివారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ) అధికారులు భవనాలను పరిశీలించారు.