ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో లోపభూయిష్ట విచారణ కారణంగా తాను దుగ్గిరాలలో ఓటు హక్కు పొందలేకపోయానని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి మండలం దుగ్గిరాలలో ఉంటున్నారు. ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా శనివారం తన ఇంటికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) వద్ద ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు.