ప్రజా గాయకుడు కామ్రేడ్ గద్దర్ మృతికి పెదకూరపాడు యుటిఎఫ్ నాయకులు శివశంకరరావు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి. ఎస్. రావు, పెదకూరపాడు సిపిఎం మండల కమిటీ ఆదివారం సంతాపం తెలిపారు. వారు మాట్లాడుతూ విప్లవ రచయిత కవి అభ్యుదయ భావాలు సమ సమాజం మార్పు కోసం తన గొంతుతో యువతని ప్రజల్ని చైతన్యం చేస్తూ తన పాట ఆట తో ప్రజా సమస్యలను ప్రస్తావించే వారన్నారు.