అప్పుల బాధ తాళలేక ఓ రైతు విషం తాగి ఆత్మహత్య కు ప్రయత్నించాడు. ఈ ఘటన రామసముద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మండలంలోని చెంబకూరు దిగువపల్లెకి చెందిన నీరిగట్టు శ్రీనివాసులు(50) ఈ ఏడాది తన పొలంలో టమాటాతో పాటు వివిధ పంటలు సాగు చేయడానికి సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. గిట్టుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయాడు. దీంతో విషం తాగి జిల్లా ఆసుపత్రిలో చేరాడు.