పూర్వంలో కేరళను పాలించిన కొందరు రాజులు రొమ్ము పన్ను వేశారని, జగన్ అంతకంటే దుర్మార్గమైన పాలకుడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. కేరళ రాజులు విధించిన రొమ్ము పన్ను పేరు ముళకరం అని వెల్లడించారు. నాటి కేరళ రాజులు కూడా జగన్ ముందు దిగదుడుపేనని లోకేశ్ వ్యాఖ్యానించారు. "జగన్ పన్ను పేరు జే ట్యాక్స్. రొమ్ముపై పన్ను వేసింది మార్తాండ వర్మ అయితే, చెత్తపై కూడా పన్నేసిన పాలకుడు సైకో జగన్. పేదల ఏడుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయి, అందుకే విద్యుత్ ఛార్జీలు తొమ్మిదిసార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు మూడు సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. నాడు రాజు మార్తాండ వర్మపై పోరాడిన మహిళ పేరు నంగేలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి మహిళా వీర మహిళ నంగేలిని ఆదర్శంగా తీసుకోని జగన్ ప్రభుత్వం పై పోరాడాలి, అప్పుడే పెంచిన పన్నులు తగ్గుతాయి" అని పిలుపునిచ్చారు