గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రిషికేష్‌కు 40 కి.మీటర్ల దూరంలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. రోడ్లపైనే యాత్రికులు పడిగాపులు కాస్తున్నాయి. 1500 వాహనాలు, 20 వేల మంది యాత్రికులు చిక్కుకున్నారు. వీరిలో తెలుగు యాత్రికులు కూడా ఉన్నారు.