పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క హామీను అమలు చేస్తూ. పేద ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలం పాతర్లపల్లి సచివాలయం పరిధిలోని స్థానిక వెంకటేశ్వరకాలనిలో మంగళవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.