నేడు విజయవాడ పరిధిలోని కృష్ణలంక ఐస్ ఫాక్టరీ వద్ద కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి కేశినేని చిన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు కేశినేని ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కేశినేని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులకు విశేష స్పందన అందుతోందన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.