పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. మంగళవారం ఉదయం జూలకల్లు నుంచి 178వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ధరల పెరుగుదల, అరాచకపాలనతో అవస్థలు పడుతున్నామని లోకేష్ కు గురజాల ప్రజలు తెలియజేసారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు.