అసత్య వార్తలను ప్రసారం చేసిన 8 యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం విధించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ముందస్తు లోక్‌సభ ఎన్నికలు అని, ఈవీఎంలను ఎన్నికల కమిషన్ నిషేధించిందని ఆయా యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు ప్రసారం చేశాయి. దీంతో యహాన్ సచ్ దేఖో, క్యాపిటల్ టీవీ, కెపిఎస్ న్యూస్, సర్కారీ వ్లాగ్, ఎర్న్ టెక్ ఇండియా, ఎస్పిఎన్ 9 న్యూస్, ఎడ్యుకేషనల్ దోస్త్, వరల్డ్ బెస్ట్ న్యూస్‌లపై నిషేధం పడింది.