గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో మంగళవారం భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20లో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 49 టీ20 ఇన్నింగ్స్‌లలో 100 సిక్స్‌ల మైలు రాయిని చేరుకున్నాడు. ఇక ఎవిన్ లూయిస్ (42) తర్వాత ప్రపంచంలోనే తక్కువ ఇన్సింగ్స్‌లలో 100 సిక్స్‌లు కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa