జగన్ అండ, ప్రోత్సాహంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు హత్యా రాజకీయాల్లో పోటీ పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆ వరుసలో ముందున్నారన్నారు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో మాచర్లవెళ్లిన తమపై రౌడీలతో దాడి చేయించారని.. ఆ కేసుని డీజీపీ ఏనాడైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. రక్తంతో తడిచిన తమ దుస్తులు పరిశీలించకుండానే కేసు విచారణ ఎలా ముగిసిందో డీజీపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.