బీహార్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ , సృజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి లిమిటెడ్‌కు సంబంధించి రూ. 1,000 కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం అరెస్టు చేసింది. బీహార్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఆధారంగా ఎన్జీవో కార్యదర్శి రజనీ ప్రియను సీబీఐ అరెస్ట్ చేసింది. నకిలీ పత్రాలను ఉపయోగించి ప్రభుత్వ నిధులను ఎన్జీవో ఖాతాల్లోకి మళ్లించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో ఎన్జీవో అధికారులు కుట్ర పన్నారని ఆరోపించారు. రికార్డు అవకతవకల ద్వారా రూ.1000 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ 24 కేసులు నమోదు చేసింది.