జపాన్‌లోని హొక్కైడోలో శుక్రవారం ఉదయం 5.44 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైంది. ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అలాగే, నేడు ఉదయం తుర్కియేలో సైతం 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత్ లోని అండమాన్, నికోబాద్ దీవుల్లో సైతం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.