గుంటూరు పట్టణం కల్యాణం వారి వీధిలో నివాసం ఉండే చింతా రమాదేవి భర్తకు అనారోగ్యంగా ఉండటంతో జులై 12న కొత్తపేటలోని యూనియన్ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు తీసేందుకు వెళ్లారు. ఆమెకు డబ్బులు తీయడం రాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి తీసిస్తానంటూ నమ్మబలికి, కార్డు మార్చి వేశాడు. అనంతరం ఆమె అకౌంట్ నుంచి రూ. 29వేలు మాయమైనట్లు గుర్తించి, గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.