గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీఓ కిరణ్ కుమార్ అధ్యక్షతన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని శిఖల అధికారులు హాజరై సక్సెస్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, విద్యా శాఖల అధికారులు పాల్గొన్నారు.