గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం ఆమోదించారు. ఏపీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్‌కు మంత్రులు, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అమలాపురం నుంచి జనుపల్లికి సీఎం వైయస్ జగన్ బయల్దేరారు. మరికాసేపట్లో నాలుగో విడత వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం వైయస్ జగన్ జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.ఖాళీగా ఉన్న రెండు శాసన మండలి సభ్యుల స్థానాలను భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో నామినేట్ చేయబడిన కర్రి పద్మశ్రీ , కుంభా రవిబాబులను ఆ ఖాళీ స్థానాల్లో శాసన మండలి సభ్యులుగా నియమిస్తూ జీవోను జారీ చేశారు.