ఒంగోలుకు వచ్చిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డిని నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, పలువురు కార్పొరేటర్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని ఎమ్మెల్యే బాలినేని నివాసానికి వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు పుష్పగుచ్చాన్ని అందజేశారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో వారు చర్చించారు.