అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో దినకరన్‌కు రూ.31 కోట్ల జరిమానా విధిస్తూ ఈడీ ఉత్తర్వలు జారీ చేసింది. అయితే ఆ మొత్తాన్ని ఆయన ఇంకా చెల్లించలేదని.. హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో సివిల్ కేసు ఉన్నట్టు దినకరన్ తరపు న్యాయవాది వాదించారు. దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందన్నారు.