గుంటూరు ఆర్ అగ్రహారానికి చెందిన వినోద్ కుమార్ జైన్ 18 సంవత్సరాల క్రిందట ప్రతిపాడు మండలం నడిం పాలెం లో 6. 50 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిలో 3. 80 ఎకరాలను ఆలేటి ప్రభావతి కి విక్రయించే నేపథ్యంలో కొద్దిరోజుల క్రిందట ఎమ్మార్పీఎస్ జెండాలు స్థలంలో పాతారని వినోద్ కుమార్ జైన్ శుక్రవారం ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవీంద్ర బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.