మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ వద్ద నిర్మాణం జరుగుతున్న సర్దార్ వల్లభాయ్50 పటేల్ రోడ్డు ఆర్చి నిర్మాణ పనులను కార్పొరేషన్ అధికారులతో కలిసి శనివారం ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి సర్దార్ రోడ్డు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు. డివైడర్ మధ్యలో ఏర్పాటు చేస్తున్న మొక్కలను, శిలాఫలకం పరిశీలించి ఏపీఎస్పీ 6వ పటాలము పేరుతో ఐలాండ్ నిర్మాణం చేయాలని సూచించారు.