మంగళగిరి నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఎడతెరపులేకుండా వర్షం కురిసింది. దీంతో నగరంలోని కాలువలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న తరుణంలో ఒక్కసారిగా వర్షం పడటంతో నగరవాసులు ఆహ్లాదానికి లోనయ్యారు. ఒక్కసారిగా వర్షం ప్రారంభమవడంతో వివిధ పనులపై బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది.