ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ప్రసిద్ధ సందర్శనీయ ప్రదేశం ఈఫిల్ టవర్ లో బాంబు ఉన్నట్లు శనివారం బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే సందర్శకులను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు స్క్వాడ్, పోలీసులు ఈఫిల్ టవర్ అంతటా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో శనివారం నుంచి సందర్శకులు ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa