జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఓ లారీ డ్రైవర్‌తో మాట్లాడగా.. ఆయన తమ గోడు వెల్లబోసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ టాక్స్ పేరుతో తమ డబ్బును దోచుకుంటున్నారని వాపోయాడు. గ్రీన్ టాక్స్ తమిళనాడులో రూ.200, తెలంగాణలో రూ.500 ఉంటే ఏపీలో మాత్రం రూ.6,660 ఉందని వివరించాడు. ఈ విషయంపై తాను మాట్లాడతానని పవన్ బదులిచ్చాడు.