అరసవల్లిలోని ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మాజీ మంత్రివర్యులు, పెనుకొండ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఈవో వి. హరి సూర్య ప్రకాష్ అందజేశారు.