ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా-పెండ్రా-మార్వాహి, కోర్బా జిల్లాల్లో ఆదివారం ఉదయం 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. కోర్బా వెస్ట్‌లో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించబడింది. భూకంపం కారణంగా పలు ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో ఆస్తి నష్టంపై బాధితులు అధికారులకు తెలియజేయాలన్నారు.