ఏపీలోని ప్రకాశం జిల్లాలో దొంగలు ఆదివారం అర్ధరాత్రి రెచ్చిపోయారు. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణికులను దోచుకున్నారు. సింగరాయకొండ-కావలి మధ్య ఈ ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో వారు చోరీలకు పాల్పడ్డారు. తర్వాత చైన్ లాగి పరారయ్యారు. కావలిలో పోలీసులకు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa