ప్రజా రాజకీయ వేదిక ఆధ్వర్యంలో కనిశెట్టి సురేష్ బాబు అధ్యక్షతన ల్యాండ్ రీ సర్వే విధానం మీద ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగినది. అనకాపల్లి పట్టణంలో వేదిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేను ఆహ్వానిస్తూ, అందలి లోపాలను సరి చేయాలని, సరిచేసిన తర్వాతనే రికార్డుల స్వచ్ఛతకు పూనుకోవాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు