డిల్లీ ఎర్ర కోట వద్ద ఈ నెల 15న జరిగే స్వాతంత్రం దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని భీమిలికి చెందిన మత్స్యకారుడు తోట నూకరాజుకి ఆహ్వానం అందింది. దేశ వ్యాప్తంగా 1800 మందిని గుర్తించి ఈ వేడుకలకు ఆహ్వానించగా అందులో నూకరాజుకి స్థానం లభించింది. ఇతడు బోటు యజమాని కాగా, 1988 నుంచి మత్స్య పరిశ్రమతో అనుబంధం ఉండగా వీరు పేద మత్స్యకారులను ఆదుకోవడంలో ముందుంటారు.