ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం పంచాయతీ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే గొల్ల బాబూరావు గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అర్హులకు ప్రభుత్వ పథకాల రాకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ కర్రి సత్యనారాయణ, నీలేందర్రావు, శ్రీపతి రాజు తదితరులు పాల్గొన్నారు.