ఉత్తర భారత దేశంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా జాడోన్ గ్రామంలో భారీ వర్షాలకు రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరిని స్థానికులు కాపాడారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ట్విట్టర్‌లో సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa